సంక్షేమ వసతి గృహ అధికారులకు కలెక్టర్ కే జండగే ఆదేశం
యాదాద్రి భువనగిరి, జూన్28 (విజయక్రాంతి): జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల పట్ల నిరంతర పర్యవేక్షణ, విద్యార్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ద పెట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే అధికారులను ఆదేశించారు. శుక్రవారం వివిధ సంక్షే మ శాఖల అధికారులు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్‌తో సమీక్ష నిర్వహించారు. డార్మిటరీ, స్టడీ రూమ్‌లతో పాటు పరిసరాల పరిశు భ్రత పాటించాలన్నారు. వసతి గృహాల నిర్వహణలో ఎటువంటి లోపాలు జరిగినా చర్య లు తప్పవన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈ వో శోభారాణి, ఏంఏ క్రిష్ణన్, డీఎంహెచ్‌వో డాక్టర్ పాపారావు, డీపీవో సునంద, బీసీడీవో యాదయ్య తదితరులు పాల్గొన్నారు.