calender_icon.png 15 November, 2024 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రోల్ అవుతున్న శ్రద్ధ

07-11-2024 12:00:00 AM

తమ అభిమాన నటి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఎవరికి ఉండదు? వారి గురించి ప్రతి ఒక్క విషయమూ ఆసక్తికరమే. వాళ్లేం తింటున్నారు? ఫిజిక్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? వాళ్లలా యంగ్‌గా ఎలా కనిపిస్తున్నారు? వంటి విషయాల పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా నటీమణులు చాలా ఫెయిర్‌గా కనిపిస్తుంటారు.

వారి శరీరం నిగనిగలాడుతూ ఉంటుంది. అసలు అదెలా సాధ్యం అనేది అందరినీ తొలిచే ప్రశ్న. అయితే చాలా మంది బాలీవుడ్ నటీమణులు ఇంటర్వ్యూలో చెప్పే సర్వసాధారణ సమాధానం ఏంటంటే.. ‘వాటర్ ఎక్కువగా తాగుతాం’.. అలాగే ’బాడీ హైడ్రేట్ కాకుండా చూసుకుంటాం’ అని చెబుతారు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రద్ధా కపూర్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఆమె తన శరీర సంరక్షణ కోసం ఎలాంటి స్కిన్ కేర్ వాడరట. కేవలం ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ వాడుతారట. ఈ వ్యాఖ్యల కారణంగా శ్రద్ధా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నారు. ‘శ్రద్ధ్దాకు స్కిన్ కేర్ అవసరం లేదు.. ఆపరేషన్ కావాలి’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’లో నటిస్తున్నారు. స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది.