calender_icon.png 20 January, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్న

20-01-2025 12:00:00 AM

ముకేశ్, నీతా అంబానీలు 

న్యూఢిల్లీ, జనవరి 19: డోనాల్డ్ ట్రంప్ రెండవ దఫా యూఎస్ అధ్యక్షుడిగా ప్రమా ణ స్వీకారం చేయనున్న ఉత్సవానికి ప్రము ఖ దేశీయ వాణిజ్యవేత్త ముకేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీలు హాజరుకానున్నారు. ఇందుకోసం యూఎస్ రాజ ధాని వాషింగ్టన్‌కు జనవరి 18నే వీరు చేరుకున్నారు. 100 మంది ప్రముఖలకు శనివా రం రాత్రిట్రంప్ ఇచ్చిన  క్యాండిల్‌లిట్ డిన్నర్‌లో అంబానీ దంపతులు పాల్గొన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇండియా నుంచి ఇందులో పాల్గొన్నది వీరేనని, ఉపాధ్యక్షుడిగా ఎంపికైన జేడీ వాన్స్, ఉషావె న్స్‌లు కూడా అంబానీ దంపతులతో కలిసారని ఆ వర్గాలు వివరించాయి. బిలియనీర్లు, విదేశీ నేతలు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు.

ట్రంప్ కుటుంబం వ్యక్తిగత ఆహ్వానం మేరకు అంబానీలు ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లారు. ట్రంప్ కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఉన్నా యి. గత ఏడాది మార్చిలో గుజరాత్‌లో జరిగిన ముకేశ్ కుమారుడు అనంత్, రాధికల వివాహానికి ట్రంప్ కుమార్తె ఇవాంకా, ఆమె భర్త కుష్నర్‌లు హాజరయ్యారు.