హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఈఈ సెట్) పరీక్ష బుధవారం జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 85.96 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం కలిపి మొత్తం 17,655 మందికిగానూ 15,150 (85.96 శాతం) మంది పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు.