calender_icon.png 27 December, 2024 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీగెట్ పరీక్షలకు 88.31% హాజరు

18-07-2024 01:16:51 AM

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): ఈనెల 6వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరిగిన కామన్ పీజీ ఎంట్రెన్స్ పరీక్షల (సీపీగెట్)కు 88.31 శాతం మంది హాజరైనట్లు కన్వీనర్ ప్రొ.ఐ.పాండురంగా రెడ్డి తెలిపారు. 45 సబ్జెక్టులకు సంబంధించి 73,342 మంది దరఖాస్తు చేసుకుంటే, 64,765 మంది పరీక్షలకు హాజరయ్యారు. మూడు సెషన్‌లలో పరీక్షలు నిర్వహించారు. ఈనెల 16వ తేదీతో పరీక్షలు ముగియగా, బుధవారం వాటి వివరాలను అధికా రులు వెల్లడించారు.