ధిక్కరణ కేసులో సహకార సంఘ రిజిస్ట్రార్‌కు ఉత్తర్వులు
హైదరాబాద్, ఆగస్టు 30(విజయక్రాంతి): హైదరాబాద్ జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గం అవకతవకలపై విచారణ నివేదికను అందజేయాలన్న ఆదేశాలను అమ లు చేయకపోవడంపై రాష్ట్ర సహకార సంఘాల శాఖ రిజిస్ట్రార్ హరిత హాజరుకు శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ విచారణను సెప్టెంబరు 27వ తేదీకి వాయిదా వేసింది. విచారణ నివేదిక ఇవ్వాలన్న హైకోర్టు ఆదే శాలను అమలు చేయకపోవడంపై జూబ్లీహిల్స్ హౌసింగ్ సహకార సంఘం మాజీ కార్యదర్శి మురళీముకుంద్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖ లు చేశారు. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టి రిజిస్ట్రార్ హాజరుకు ఆదేశాలు జారీ చేశారు.