28-03-2025 12:13:13 AM
కునాల్ కమ్రాకు రెండోసారి ముంబై పోలీసుల సమన్లు..
న్యూఢిల్లీ: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణ నిమిత్తం మార్చి 31న తమ హాజరు కావాలని కమెడియన్ కునాల్ కమ్రాకు ముంబై పోలీసులు సూచించారు. కామెడీ షోలో భాగంగా షిండేను ‘గద్దార్’ (ద్రోహి)గా కమ్రా అభివర్ణించారు. దీంతో శివసేన ఎమ్మెల్యే ఫిర్యాదుతో పోలీసులు కమ్రాపై పరువునష్టం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే విచారణకు హాజరుకావాలని మంగళవారం కమ్రాకు పోలీసులు సమన్లు జారీ చేశారు. అయితే విచారణకు హాజరయ్యేందుకు తనకు వారంపాటు సమయం ఇవ్వాలని పోలీసులను కమ్రా కోరారు. కమ్రా విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించారు. మార్చి 31న విచారణకు హాజరుకావాలంటూ తెలుపుతూ మరోసారి సమన్లు జారీ చేశారు.