17-04-2025 12:08:55 AM
జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ ఏప్రిల్ 16 (విజయ క్రాంతి) : భూ భారతి చట్టంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు గాను నేటి నుంచి ఈనెల 29వ తేదీ వరకు మండల కేంద్రాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి బుధవారం ఒక పట్టణంలో పేర్కొన్నారు. అధికారులు పూర్తిస్థాయిలో మండ లాల్లో నిర్వహించే తేదీలను పూర్తిస్థాయిలో ప్రచారం కల్పించడం జరుగుతుందని, ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని తెలిపారు.