calender_icon.png 16 January, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజ్రీవాల్‌ను భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి

27-07-2024 02:20:47 AM

  1. ఆయన షుగర్ లెవల్స్ పడిపోయాయి 
  2. కూటమి నేతలతో కలిసి నిరసన తెలియజేస్తాం 
  3. ఆప్ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్

న్యూఢిల్లీ, జూలై 26 : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను రాజకీయ ఖైదీగా, కుట్ర బాధితుడిగా ఆమ్‌ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ పేర్కొన్నారు. కేజ్రీవాల్ అరెస్టును కక్ష్య సాధింపు చర్యగా అభివర్ణించారు. మోదీ ప్రభుత్వ కుట్ర కారణంగా కేజ్రీవాల్ జైలులో ఉన్నాడని, ఆయన కుట్ర బాధితుడని తెలిపారు. కేజ్రీవాల్ గొంతెత్తకుండా భయపెట్టే ప్రయత్నాలు జరుగుతు న్నాయని ఆరోపించారు. కేజ్రీవాల్ 30 ఏళ్లుగా తీవ్రమైన మధుమేహం, హైపోగ్లుసైమియాతో బాధపడుతున్నారని, ఇది ఆయన ఆరోగ్యానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 3 నుంచి జూలై 7 మధ్య జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు ఆయన షుగర్ లెవల్స్ 34 సార్లు పడిపోయాయని, ఆయనకు ప్రమా దం పొంచి ఉందని గుర్తు చేశారు.

కేజ్రీవాల్‌పై జరుగుతున్న కక్ష సాధింపు చర్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమి మిత్రపక్షాలతో మాట్లాడిందని, జూలై 30న దీనిపై ఢిల్లీలలో నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. “కేజ్రీవాల్ అరెస్టు ఏ వ్యక్తికి లేదా పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు. ఇది దేశంలోని వ్యవస్థలకు సంబంధించిన అంశం. ఇలాంటివి జరిగితే రాజకీయాల్లోకి రావాలనుకునే యువతరం వెనకడుగు వేస్తుంది. కొత్త పార్టీ పెట్టాలనుకునే వారు తమ ఆలోచన మార్చుకుంటారు. ఈ అం శంపై భారత కూటమి సభ్యులతో చర్చిం చాం. ఇది కేవలం కేజ్రీవాల్‌కు సంబంధించిన విషయం కాదు. నియం తృత్వానికి వ్యతి రేకంగా దేశం తనను తాను రక్షించుకోవడానికి కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయిం చాం” అని సందీప్ పాఠక్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.