calender_icon.png 26 December, 2024 | 2:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్‌పై లైంగికదాడికి యత్నం

26-12-2024 02:30:19 AM

* ఐదుగురి అరెస్ట్

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 25 (విజయక్రాంతి): మైనర్‌పై లైంగికదాడికి యత్నించిన ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. సోమవారం రాత్రి బోరబండకు చెందిన ఓ బాలిక ఆటోలో ప్రయాణిస్తుండగా ఐదుగురు ఆకతాయిలు ఆటోను అడ్డుకొని బాలికపై లైంగికదాడికి యత్నించారు. అడ్డుకున్న ఆటో డ్రైవర్‌పై దాడికి దిగారు. వారి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకున్నప్పటికీ ఆ ఐదుగురు వెంబడించి హంగామా చేయడంతో స్థానికులు డయల్ 100కి సమాచారం అందించారు.