25-03-2025 01:06:18 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మేడ్చల్, మార్చి 24 (విజయక్రాంతి) : హైదరాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. సికింద్రా బాద్ నుంచి మేడ్చల్‌కు వెళుతున్న ఎం ఎంటీఎస్ రైలులో ఓ యువతి(23)పై ఓ యువకుడు (25) అత్యాచారయత్నం చేశాడు. దీంతో భయంతో నడుస్తున్న రైలులో నుంచి భయటకు దూకిన ఆమె కు తీవ్ర గాయాలయ్యాయి. అల్వాల్, గుండ్ల పోచంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది.
సికింద్రాబాద్ రైల్వే పోలీసుల కథనం మేరకు.. అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువతి మేడ్చల్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 22న సాయంత్రం మేడ్చల్ రైల్వేస్టేషన్ నుంచి ఎంఎంటీఎస్ రైలులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఆమె సెల్ ఫోన్ రిపేర్ చేయించుకుని తిరిగి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చి ఎంఎంటీఎస్‌లో మహిళల కోచ్ లో మేడ్చల్‌కు బయలుదేరింది.
అప్పటికే ఆ బోగీలలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు మార్గమధ్యంలోని అల్వా రైల్వేస్టేషన్లో దిగిపోయారు. అనంతరం ఆ కో లో ఒంటరిగా ఉన్న ఆమె దగ్గరకు ఓ యువకుడు వచ్చి ఆమెను పట్టుకొని అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నడుస్తున్న రైలు నుంచి ఆమె బయటకు దూకేసింది.
కొంపల్లి సమీపంలోని రైలు బ్రిడ్జి వద్ద పడిపోవడం తో గాయపడి ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు 108కు ఫోన్ చేసి సమాచారం అంది ంచారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది ఆమెకు ప్రథమచికిత్స చేసి మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బయటకు దూకడంతో బాధితురాలి పళ్లు ఊడిపోయా యి. బాధితురాలి వద్ద నుంచి స్టే రికా ర్డు చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకు ని దర్యాప్తు చేస్తున్నారు.
కేంద్ర మంత్రుల చొరవతో మెరుగైన చికిత్స
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా వెళ్లి పరామర్శిం చారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి సంజయ్ ఫోన్‌లో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించేందుకు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారని సూచించారు.
బాధితురాలికి నేతల మద్దతు
ఈ వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు ఎక్స్ వేదికగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బాధితురాలికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎంఎంటీఎస్ రైలులో ఉద్యోగినిపై అత్యాచారయత్నం ఘటన తెలంగాణ సమాజాన్ని కలిచివేసింది అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా బాధితురాలిని రైల్వే ఎస్పీ చందనదీప్తి, మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి లు పరామర్శించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పో ప్రభుత్వ నిఘా వైఫల్యమే కారణమని ఆరోపించారు.
శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. అందాల పోటీలు నిర్వహించడం కాదని, మహిళలకు రక్షణ కల్పించాలన్నారు. రాష్ట్రంలో మహిళ పట్ల చిన్న చూపు ఉందన్నారు. దేశంలోనే అతిపెద్ద కామండ్ కం ఉన్న మ రా ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం అన్నారు. బాధితురాలికి సూపర్ స్పె తరహాలో నాణ్యమైన వైద్యం అందించాలని, నిందితున్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.
నాలుగు ప్రత్యేక బృందాలు : రైల్వే ఎస్పీ చందనా దీప్తి
ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ నిందితుడి ఆచూకి కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేశామని రైల్వే ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. టెక్నికల్ ఎవిడెన్స్‌తో త్వరలోనే నిం దితుడిని పట్టుకుంటామని చెప్పారు.
బీజేపీ ఎమ్మెల్యేల పరామర్శ
యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని బీజేపీ ఎమ్మెల్యేలు శంకర్, హరీశ్, రామారావు పటేల్ సోమవారం సాయంత్రం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.