calender_icon.png 31 March, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికపై అత్యాచారయత్నం

29-03-2025 01:51:17 AM

సూర్యాపేట, మార్చి28(విజయక్రాంతి): బతుకుదెరువు కోసం ఇటుకలు తయారు చేయడానికి ఒరిస్సా నుంచి వచ్చిన మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి ప్రయత్నిం చాడు ప్రబుద్ధుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండల పరిధిలోని పాత సూర్యాపేట శివారులో వెంగమాంబ బాలాజీ ఇటుకల యజమాని వెంకటరమణ అందులో పని చేసేందుకు కొందరు కూలీలను ఒరిస్సా నుంచి  తీసుకువచ్చాడు.

కాగా బుధవారం మద్యం మత్తులో ఉన్న వెంకటరమణ అక్కడే పనిచేస్తున్న మైనర్ బాలికను చాక్లెట్ ఇస్తాను అని పిలిచి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. బాలిక భయంతో కేకలు వేస్తూ అక్కడినుండి బయటకు  వెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం చెప్పింది. దీంతో ఒరిస్సా నుండి వచ్చిన కూలీలందరూ ఈ ఘటనపై యజమాని గోగినేని వెంకటరమణ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వెంకటరమణ విషయం బయటకు పోకుండా నాన్న ప్రయత్నాలు చేసినప్పటికీ గురువారం బాలిక కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ బి శ్రీకాంత్ గౌడ్ ఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు ఇటుక బట్టి యజమాని గోగినేని వెంకటరమణ అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. శుక్రవారం మైనర్ బాలికను భరోసా సెంటర్ తరలించి వాంగ్మూలం రికార్డ్ చేశారు. కాగా వెంకటరమణ పై ఫోక్సు లేబర్ యాక్ట్ జువైనల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.