12-02-2025 12:00:00 AM
పెట్రోల్ పోసిన యువకుడు
సూర్యాపేట, ఫిబ్రవరి ౧౧: తనను ప్రేమించడంలేదని ఓ యువతిపై యువకుడు పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌న గర్‌లో జరిగింది. ఖమ్మం జిల్లా మోటమర్రి గ్రామానికి చెందిన యువతి హుజూర్‌నగర్ లోని తన మేనమామ ఇంట్లో ఉంటూ ప్రైవే టు సంస్థలో ఉద్యోగం చేస్తున్నది.
ఆ యువ తి స్వగ్రామానికి చెందిన సుందర్ ప్రమోద్‌కు మార్.. మాట్లాడాలని ఫోన్‌లో చెప్పడంతో ఆమె తాను పనిచేస్తున్న కంపెనీ నుంచి బయటకు వెళ్లింది. కోదాడ రోడ్డులో ఉన్న ఓ దుకాణం వద్ద మాట్లాడుతుండగా తనను ఎందుకు ప్రేమించడంలేదని యువతితో గొడవపడి తనతో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆమెపై పోశాడు. గమనించిన స్థానికులు ప్రమోద్‌కుమార్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.