సీఐ ఇంద్రసేనారెడ్డి...
రామగుండం (విజయక్రాంతి): గోదావరిఖనిలో యువకునిపై హత్యాయత్నానికి పాల్పడ్డారని 1-టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరాంకుశం ప్రతిమ డ్యూటీ నుండి తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఆమె భర్త పరాంకుశం యశ్వంత్(36) గోదావరిఖని తన క్వార్టర్ లో రక్తపు మడుగులో పడి ఉండడంతో అతని తల, ముఖం, ఇతర భాగాలపై రక్త గాయాలు ఉండగా, వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పిటల్ తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారని, ఎవరో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఏదో పగతో ఇంట్లోకి ప్రవేశించి పదునైన ఆయుధాలతో యశ్వంత్ పైన దాడి చేయడంతో తీవ్ర రక్త గాయాలై, రక్తం మడుగులో ఉండటంతో గమనించిన భార్య గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారని పరాంకుశం ప్రతిమ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని సీఐ తెలిపారు.