calender_icon.png 6 January, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానంతో భార్య మేనమామపై హత్యాయత్నం

01-01-2025 01:24:15 AM

రామగుండం, డిసెంబర్ 31: భార్యపై అనుమానంతో భార్య మేనమామపై హత్యా యత్నం  కేసులో చాకచక్యంగా వ్యవహరించి 5గంటల్లో నిందితులను పట్టుకున్నమని ఏసీ బీ మడత రమేష్ తెలిపారు.

మంగళవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రానికి చెందిన గొల్ల శ్రావణ్ 28 అనే వ్యక్తి ఆరు సంవత్సరాల క్రితం పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని గోదావరిఖని వినోభానగర్‌కు చెందిన కాళ్ల పూజతో ప్రేమ వివాహం జరిగింది.

వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గొల్ల శ్రావణ్ క్కు ఇతర మహిళతో వివాహేతర సంబంధం ఉన్నదని భార్య భర్తల మధ్య గత సంవత్సర కాలంగా గొడవ లు జరుగుతున్నాయి. వీరి మేనమామ అయిన నంది శ్రీనివాస్ 38  వినోభానగర్, గోదావరిఖని అనే వ్యక్తి తన మేనకోడలు అయిన పూజను మంచిగా చూసుకోవాలని సూచించాడు. శ్రావణ్‌కు తన పద్దతి మార్చుకోవాలని సూచించాడు.

అయినా తన ప్రవర్తన మార్చుకోకుండా వారం రోజు ల క్రితం కూడా గొల్ల శ్రావణ్ పూజను కొట్ట డంతో నంది శ్రీనివాస్, నంది నగేష్, కాళ్ల కిరణ్‌లు భీమారంకు వెళ్లి పూజను గోదావరి ఖనికి తీసుకువచ్చారు.

దీనిపై పగ పెంచుకు న్న గొల్ల శ్రావణ్ తన తల్లిదండ్రులు అయిన గొల్ల నరేందర్, గొల్ల పద్మ, చిన్నమ్మలు అయిన వేద వరలక్ష్మి, పర్మ స్వపు, అతని అమ్మమ్మ అయిన పర్శ బతుకమ్మలు కుట్ర పన్ని, వారి ప్రోద్బలముతో ముందస్తు ప్రణాళిక  మంగ ళవారం  ఉదయం 11.45 గంటలకు గోదావరిఖనిలో వెంకటేశ్వ ర ఎలక్ట్రికల్ షాపులో పని చేస్తున్న నంది శ్రీనివాస్ వద్దకు వెళ్లి నీతో మాట్లాడేది ఉంద ని, తన బైక్‌పై ఎక్కిం చుకుని గోదావరిఖని బాలుర జూనియర్ కళాశాల మైదానంలోకి తీసుకువచ్చాడు.

అప్పటికే గొల్ల శ్రావణ్ తన వెంట తెచ్చుకు న్న కత్తితో నంది శ్రీనివాస్‌పై దాడి చేసి గాయపర్చాడు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరు కుని శ్రీనివాస్‌ను ప్రభుత్వాసుత్రికి తరలించా రు. శ్రీనివాస్ సోదరుడు నగేష్ ఫిర్యాదు మేరకు నిందితుడు శ్రావణ్, అతని కుటుం బ సభ్యులపై కేసు నమోదు చేశారు.

సీపీ శ్రీనివాస్, పెద్దపల్లి డీసీపీ చేతన ఆదేశాల మేరకు గోదావరిఖని ఏసీపీ రమేష్ ఆధ్వ ర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పా టు చేసి, నిందితుని కోసం గాలింరు. గోదా వరిఖని వన్-టౌన్ సీఐ, ఎస్‌ఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బృందాలు గోదావరిఖని గంగానగర్ బ్రిడ్జి వద్ద శ్రావణ్‌ను పట్టుకుని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలిం చమన్నారు. నిందితునికి కఠినమైన శిక్షణ పడేలా చర్యలు తీసుకుంటామని ఏసీబీ తెలిపారు. ఏసీబీ వెంట వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఎస్‌ఐలు ఉన్నారు.