ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు దివాకర్
కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): రెబ్బెన మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పొటు శ్రీధర్ రెడ్డి తో పాటు అతని అనుచరులపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు దివాకర్ డిమాండ్ చేశారు. పొటు శ్రీధర్ రెడ్డి సతీమణి గోలేటి సర్పంచ్ గా చేపట్టిన పదవీకాలంలో అవినీతి అక్రమాలపై ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కి ఫిర్యాదు చేయడంతో శ్రీధర్ రెడ్డితో కలిసి బెదిరింపులకు దిగడమే కాకుండా చంపుతానని హెచ్చరించడంతో సోమవారం ఎస్పీ కార్యాలయంలో నాయకులతో కలిసి ఉపేందర్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు నిర్వహిస్తారా ప్రశ్నించారు. దాడులకు భయపడేది లేదని అవినీతి అక్రమాలపై సంఘం ఆధ్వర్యంలో నిత్యం పోరాటాలు ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. పోలీసులు పూర్తి విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు. బెదిరింపులకు గురి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పిడుగు శంకర్, చిరంజీవి ,మోహన్ బాబు, తదితరులున్నారు.