సిరిసిల్ల, నవంబర్ 10 (విజయక్రాంతి): విధుల్లో ఉన్న పోలీసులపై ఓ తాగుబోతు దాడికి యత్నించగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై పృథ్వీధర్‌గౌడ్ తెలిపారు. బోయినపల్లిలో బ్లూ కోర్ట్ సిబ్బంది రమేష్, క్రాంతికుమార్ విధుల్లో ఉండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతని వద్దకు వెళ్లి వివరాలు అడుగ గా మద్యం మత్తులో ఉన్న అతడు బూతులు తిడుతూ, తన చేతిలో ఉ న్న బీరు సీసాను పగులగొట్టి దాడికి యత్నించాడు. వారి ఫిర్యాదు మేర కు నిందితుడిపై కేసు నమోదైంది. నిందితుడు మల్యాల గ్రామానికి చెందిన కనగర్తి సాయికుమార్‌గా గుర్తించారు.