07-03-2025 01:31:41 AM
న్యూఢిల్లీ, మార్చి 6: ఖలిస్థానీ ఉగ్రకుట్ర మరోసారి బట్టబయలైంది. భారత్‌పై, భారత నేతలపై అక్కసు వెళ్లగక్కుతున్న ఖలిస్థానీ తీవ్రవాదులు, ఖలిస్థానీ సానుభూతిపరులు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌పై దాడికి యత్నించారు. లండన్ పర్యటనలో ఉన్న విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ బుధవారం రాత్రి ఓ అధికారిక కార్యక్రమానికి హాజరయ్యారు.
కార్యక్రమం నుంచి ఆయ న బయటకు వస్తున్న సమయంలో కొంతమంది ఖలిస్థానీ సానుభూతిపరులు ఖలిస్థానీ జెండాలను ప్రదర్శిస్తూ భారత్‌కు, జైశంకర్‌కు వ్యతిరేకం గా నినాదాలు చేశారు. అందులో ఒక వ్యక్తి భారత్ జెండాను అవమానిస్తూ జైశంకర్ కారుకు అత్యంత సమీపంలోకి దూసుకొచ్చాడు. ఆ వ్యక్తిని లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
లండన్‌లోని ఛాఠమ్ హౌజ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో తెగ సర్క్యులేట్ అవుతోంది. ఇక మరో వీడియోలో జైశంకర్ కార్యక్రమానికి దగ్గర్లో కొంత మంది ఖలిస్థానీ జెండాలు పట్టుకుని ఖలిస్థానీ నినాదాలు చేస్తూ కనిపించారు. ఐదు రోజుల పర్యటన నిమిత్తం జైశంకర్ లండన్‌కు వెళ్లారు.
ఈ ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆతిథ్యదేశం తగిన చర్యలు తీసుకుంటుందని నమ్ముతున్నట్లు పేర్కొంది. ఈ ఘటనను బ్రిటన్ కూడా ఖండించింది. ఇలాంటి అధికారిక కార్యక్రమాల్లో భద్రతా చర్యలకు తూట్లు పొడిచే చర్యలను తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది.
పంజాబ్‌లో ఖలిస్థానీ టెర్రరిస్ట్ అరెస్ట్
యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో అమృత్‌సర్‌కు చెందిన ఓ ఖలిస్థానీ ఉగ్రవాది అరెస్ట్ అయ్యాడు. అతడికి పాక్‌కు చెందిన ఐఎస్‌ఐతో కూడా లింకులున్నట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం 3.20 ప్రాంతంలో ఈ అరెస్ట్ చోటు చేసుకుంది. అతడిని లజర్ మషిష్‌గా గుర్తించారు.
మారణాయుధాలు, ఇతర పేలుడు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మూడు హ్యాండ్ గ్రనేడ్లు, రెండు డిటోనేటర్లు, 7.62 ఎంఎం రష్యన్ పిస్తోల్, 13 లైవ్ క్యాటరేడ్జెస్ మొదలయినవి లభించాయి. అంతే కాకుండా ఘజియాబాద్ అడ్రస్‌తో ఉన్న ఆధార్ కార్డు, సిమ్ కార్డ్ లేని సెల్‌ఫోన్ కూడా లభించినట్లు పోలీసులు తెలిపారు. కేంద్రమంత్రి జైశంకర్‌పై దాడికి యత్నాన్ని బ్రిటన్ విదేశాంగశాఖ ఖండించింది.