03-04-2025 12:44:36 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 2 (విజయ క్రాంతి) : మైనార్టీల హక్కులను కాలరాసే విధంగా బిజేపి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎఐసిసి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
బుధవారం మహబూబ్ నగర్ పట్టణం లోని 11,25 వ వార్డు లో నిర్వహించిన జై బాపు , జై భీం, జై సంవిధాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నడం తో పాటు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలాలు వేసి నివాళులర్పించారు.
అనంతరం వీరన్నపేట్, కిసాన్ నగర్, ఓబులాయిపల్లి గ్రామంలో, బండమీద పల్లి, కిద్వాయిపేట్, పాత పాలమూరు ప్రాంతాలలోని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. అనంతరం బాలర కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సంతన్నధుల నుంచి ఇంటర్ రెండవ సంవత్సరం పూర్తయిన విద్యార్థులకు ఎంసెట్, నీట్ కోర్సులకు సంబంధించి ఉచితంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కోచింగ్ సెంటర్లో శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మైనారిటీల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుందని, అందులో భాగంగానే రాజ్యాంగం మార్చాలనే కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందరం సమానంగా సన్న బియ్యం ఇకపై నుంచి తిందామని తెలిపారు. ప్రజల సంక్షేమ కోసం ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, డిసిసి ఉపాధ్యక్షులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, అజ్మత్ అలి, ప్రవీణ్ కుమార్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తిరుమల వెంకటేష్, ఖాజా పాషా, రాషెద్ ఖాన్, మోసిన్, అంజద్, నాయకులు కిషన్ నాయక్, అర్షద్ అలి, బిసి సంక్షేమ శాఖ అధికారి ఆర్ ఇందిర పాల్గొన్నారు.