calender_icon.png 26 November, 2024 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడికి యత్నం

26-11-2024 01:07:21 AM

మాజీ సర్పంచుల అరెస్టు 

  1. కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు 
  2. దిగిన మాజీ సర్పంచులను 
  3. అడ్డుకుంటున్న పోలీసులు 

కరీంనగర్, నవంబరు 25 (విజయక్రాంతి): పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ సర్పంచులు సోమవారం కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లా తాజా మాజీ సర్పంచుల జేఏసీ కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించి కలెక్టరేట్ వద్దకు తరలివచ్చిన మాజీ సర్పంచులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


ఈ అరెస్టులను మాజీ సర్పంచుల జేఏసీ అధ్యక్షుడు జోగు సాగర్, నాయకులు అక్కెనపల్లి కరుణాకర్, మేచినేని నవీన్‌రావు, జగన్, గంగాధర్, దామోదర్, వెంకన్న, నర్సయ్య, నజీర్, ఆదిమల్లు కొంకటి శేఖర్, పంజాల అంజన్న, తిరుపతి, రామిడి  సురేందర్, ముక్కెర మల్లేశం, రాచూరి మల్లేశం, బోయిని అశోక్, అంజన్న ఖండించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పెండింగ్‌లో ఉన్న రూ.15 కోట్లను విడుదల చేయాలని కోరారు.