బాన్సువాడ, ఆగస్టు 3: తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించిన నిందితుడ్ని స్థానికులు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన ఘటన శనివారం వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం వెళ్లే దారిలో ఓ గ్రామానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పిన నిందితుడు.. బాలికను సోమేశ్వరం గ్రామ సమీపంలో ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లాడు. లైంగిక దాడికి యత్నించడంతో బాలిక కేకలు విన్న స్థాని కులు నిందితుడ్ని పట్టుకొని దేహశు ద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. సొమేశ్వరం గ్రామాని కి చెందిన నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.