calender_icon.png 23 October, 2024 | 12:45 AM

ఫోర్జరీ పత్రాలతో స్థలం విక్రయించే యత్నం

11-07-2024 12:15:00 AM

ఇద్దరి అరెస్టు 

రాజేంద్రనగర్, జూలై 10: ఫోర్జరీ పత్రాలతో స్థలం విక్రయించేందుకు యత్నించిన ఇద్దరిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం డీసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. నగరంలోని బహదూర్‌పుర ప్రాంతానికి చెందిన ముకరము ద్దీన్ ఖాన్, ఫైనాన్సర్ అశ్వక్ ఖాన్ కలిసి రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి సర్వేనంబర్ 78లో 3,600 గజాల స్థలానికి టీడీఆర్ తీసుకున్నట్లు చూపించారు. ఆ స్థలానికి సంబంధించి వివిధ శాఖలకు చెందిన అధికారులను మేనేజ్ చేసి అన్ని పత్రాలు సృష్టించారు. ఉప్పర్‌పల్లికి చెందిన సందీప్ రెడ్డి.. తనకు చెందిన సర్వే నంబర్లలో తమకు మూడు ఎకరాల 8 గుంటల స్థలం ఉందని కొంద రు నకిలీ పత్రాలు సృష్టించి తమను ఇబ్బంది పెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేంద్రనగర్ పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ముకరముద్దీన్‌ఖాన్, అశ్వక్‌ఖాన్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం కూడా ఉందని డీసీపీ తెలిపారు. విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.