calender_icon.png 29 November, 2024 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువు శిఖం కబ్జాకు యత్నం

29-11-2024 01:23:47 AM

సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావుతో పాటు మరో ముగ్గురిపై కేసు

శేరిలింగంపల్లి, నవంబర్ 28: ఖాజాగూడలోని భగీరథమ్మ చెరువు శిఖం భూమిని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని ఇరిగేషన్ అధికారులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యా దు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు సదరు స్థలాన్ని మట్టితో చదును చేస్తున్న వారిని, జేసీబీ ఓనర్ నరేశ్‌ను అరెస్ట్ చేశారు. దాదాపు 700 గజాల స్థలాన్ని మట్టితో నింపినట్లు గుర్తించారు. సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావు డైరెక్షన్‌లోనే చెరువు శిఖాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని తెలుసుకున్నారు.

ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ బీ శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు శ్రీధర్‌రావుతో పాటు వెంకటేశ్వరరావు, సత్యనారాయణ మూర్తి, మణికంఠలపై రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదు చేశారు. కాగా గచ్చిబౌలి పీఎస్ పరిధిలో శ్రీధర్‌రావుపై మరో కేసు నమోదైంది. తమ స్థలంలో నిర్మించుకున్న ఇళ్లను శ్రీధర్‌రావు కూల్చివేయించారని బాధితులు గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.