calender_icon.png 22 February, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్మశాన వాటిక కబ్జాకు యత్నం

21-02-2025 01:04:26 AM

* రోడ్డు కిరువైపులున్న చెట్టు నరికివేత 

* పోలీసులకు ఫిర్యాదు చేసిన పంచాయతీ కార్యదర్శి 

* నిందితునిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు

కోనరావుపేట, ఫిబ్రవరి 20: కబ్జాకు కాదేది అనరం అన్న చందంగా స్మశాన వాటికను కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. స్మశాన వాటికలో  రోడ్డు కు ఇరువైపులా ఉన్న చెట్లను నరికి వేశారు. ఈ చెట్ల నరికివేతకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డి మాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమర్ల గ్రామ శివారులో ఉన్న స్మశాన వాటిక లో గుర్తు తెలియని వ్యక్తులు చెట్లను నరికి వేశారు.

తర్వాత ఆ భూమిని చదును చేసి కబ్జా చేసుకునే ప్రయత్నంలో కొందరు వ్యక్తులు ఉన్నా రని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2021లో ప్రభుత్వ నిధులు రూ. 12 లక్షలతో స్మశాన వాటికను నిర్మాణం చేపట్టారు అప్పటినుండి స్మశాన వాటికలో దహన సంస్కారాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్మశాన వాటిక లో  ఏపుగా పెరిగిన చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికి వేశారు.

దీంతో ఈ విషయా న్ని స్థానిక పంచాయతీ కార్యదర్శి జ్యోతి దృ ష్టికి స్థానికులు తీసుకవెళ్లారు. స్మశాన వాటిక కబ్జాకు యత్నించిన  వ్యక్తులపై  తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్మశాన వాటికను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేలా కలెక్టర్ స్పందించాలని స్థానికులు కోరుతున్నారు