calender_icon.png 17 March, 2025 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రద్దయిన నోట్ల మార్పిడికి యత్నం

17-03-2025 01:04:07 AM

  • నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు 

రూ.55.52 లక్షల కరెన్సీ స్వాధీనం

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 16 (విజయక్రాంతి): రద్దయిన నోట్ల మార్పిడికి యత్నించిన నలుగురిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.55.52లక్షల విలువైన పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్టు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర ఆదివారం తెలిపారు. నగరంలోని లంగర్‌హౌజ్‌కు చెందిన సయ్యద్ ముజమ్మి ల్ హుస్సేన్ గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపా రం చేశాడు.

2006లో అతను సౌదీఅరేబియాకు వెళ్లి 2019లో తిరిగి వచ్చాడు. అతని కుటుంబం వద్ద రూ.30 లక్షలు పాత నోట్లు ఉన్నాయి. నోట్లు రద్దయిన సమయంలో వాటిని మార్చుకుంటే ఆదాయ పన్ను కట్టా ల్సి వస్తుందని మార్చుకోలేదు. ముజమ్మిల్ హుస్సేన్ సహచరుడు అమ్జద్ ఖాన్ అనే వ్యక్తితో కలిసి వారికి తెలిసిన ఏజెంట్ల ద్వారా రూ.25.52 లక్షలను సేకరించి వాటిని మార్చుకోవడానికి ప్రయత్నించారు.

పాల్తి భాస్కర్, షేక్ సలీమ అనే ఏజెంట్లను సంప్రదించి వారికి ఐదు శాతం కమీషన్ కింద ఒప్పందం కుదుర్చుకున్నారు. శనివారం నగరంలోని అబిడ్స్‌లో గల తాజ్‌మహల్ హోటల్‌లో ఆ కరెన్సీని 10 శాతం కమీషన్ చెల్లించి మార్చుకోవడానికి ఒప్పందం కుదర్చుకున్నారు.

విశ్వసనీయం సమాచారం మేరకు సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నేరేడ్‌మెట్‌కు చెందిన షేక్ నసీమా, మేడ్చల్‌కు చెందిన పాల్తి భాస్కర్ అనే ఏజెంట్లు, లంగర్‌హౌజ్‌కు చెందిన సయ్యద్ ముజమ్మిల్ హుస్సేన్, అమ్జాద్ ఖాన్ నుంచి రూ.55.52 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.వెయ్యి నోట్లు 4,338, రూ.500 నోట్లు 2,429 ఉన్నాయి.