calender_icon.png 19 November, 2024 | 3:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రమంత్రిపై దాడికి యత్నం

01-09-2024 01:06:33 AM

అసభ్యకరంగా మాట్లాడుతూ కొట్టేందుకు ప్రయత్నం

బెగుసరాయ్ (బీహార్), ఆగస్టు 31: కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌పై ఓ వ్యక్తి దాడికి యత్నించడం కలకలం సృష్టించింది. బీహార్‌లోని తన సొంత నియో జకవర్గం బెగుసరాయ్‌లో జనతా దర్బార్ నిర్వహిస్తున్న సమయంలో మంత్రిపై ఓ వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడుతూ పిడిగుద్దులు కురిపించేందుకు ప్రయత్నించాడు. కార్యక్ర మం ముగిసిన వెంటనే గిరిరాజ్ బయటకు వెళుతుండగా.. మంత్రి మైక్రోఫోన్‌ను సదరు వ్యక్తి లాక్కున్నాడు. అనంతరం మంత్రిపై దాడి చేయబోతుండగా పార్టీ కార్యకర్తలు, భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు.

ఆ తర్వాత గిరిరాజ్ ముర్దాబా ద్ అంటూ నినాదాలు చేశాడు. అయి తే, ఇలాంటి దాడులకు తాను భయపడనని గిరిరాజ్ స్పష్టం చేశారు. నాపై జరిగిన దాడిని చూస్తే ఆ వ్యక్తి వద్ద ఒకవేళ రివాల్వర్ ఉంటే తప్పకుండా నన్ను కాల్చేవాడు. ఏదైమైనా అతని దాడి విఫలమైంది. అతను చాలా అసభ్యకరంగా మాట్లాడాడు అని దాడి అనంతరం గిరిరాజ్ తెలిపారు. ఈ ఘటనపై బెగుసరాయ్ ఎస్పీ మాట్లాడుతూ.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.