calender_icon.png 16 January, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్టహాసంగా ఐఐఐటీ స్నాతకోత్సవం

14-07-2024 12:21:04 AM

600 గ్రాడ్యుయేట్, 32 పీహెచ్‌డీ పట్టాల అందజేత

హైదరాబాద్, జూలై 13(విజయక్రాంతి): ఐఐఐటీ స్నాతకోత్స వం శనివారం గచ్చిబౌలిలోని గ్లోబ ల్  పీస్ ఆడిటోరియంలో అట్టహాసంగా జరిగింది. సీఎస్‌ఐఆర్ డైరెక్టర్ జనరల్, డీఎస్‌ఐర్ సెక్రటరీ ఎన్ కలైసెల్వి ముఖ్య అతిథిగా హాజరవ్వగా.. 600 మందికి గ్రాడ్యుయేట్, 32 మందికి పీహెచ్‌డీ పట్టాలను అందజేశారు. యూనివర్సిటీ చరిత్రలో ఇంతమందికి ఒకేసారి డాక్టరేట్లు ప్రదానం చేయడం మొదటిసారి. 2024 ఏడాదికి బీటెక్ ఈసీఈలో యమ్రనేని జైష్ణవ్ గోల్డ్‌మెడల్ సాధించగా.. సీఎస్‌ఈకి చెందిన హర్షవర్ధన్ బెస్ట్ ఆల్-రౌండర్ అవా ర్డు పొందారు. ఇక్కడి నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థులు దేశం గర్వించేలా భవిష్యత్‌లో ముందుకు సాగాలని ఐఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ నారాయణన్ కోరారు.