మహబూబ్ నగర్, జనవరి 9 (విజయ క్రాంతి): జాతీయ హ్యాండ్ బాల్ క్రీడల సమ రానికి మహబూబ్ నగర్ జిల్లా వేదిక అయింది. జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ హ్యాండ్ బాల్ పోటీలను జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానం నందు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ప్రారంభించారు.
జిల్లా ఒలంపిక్ సం ఘం అధ్యక్షులు ఎన్పి వెంకటేష్, మూడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్‌తో పాటు ప్రజా ప్రతి నిధుల సమక్షంలో జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం అయ్యాయి.. 68వ ఎస్జిఎఫ్ అండర్-17 బాల, బాలికల జాతీయ హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో నుంచి 36 జట్ల క్రీడాకారులు ఈ పోటీలలో భాగస్వాములు కానున్నారు.
మొత్తం 1550 మంది క్రీడాకా రులు ఈ పోటీలలో పాల్గొననున్నారు. ఈ క్రీడలు ఈనెల 14వ తేదీ వరకు జరగను న్నాయి. ఈ మేరకు అండర్ 17 ఎస్జిఎఫ్ సెక్రటరీ శారదాబాయి, టోర్నీ ఆర్గనైజర్లు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తు న్నారు. శనివారం నుంచి హ్యాండ్ బాల్ పోటీలు వేగంగా జరగనున్నాయి.