calender_icon.png 18 January, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతిభద్రతలు కాపాడకుండా దాడులా?

14-09-2024 12:23:38 AM

ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి గూండాలకు మద్దతు పలుకుతూ బీఆర్‌ఎస్ నేతలపై దాడులు చేయిస్తున్నారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలపై కేసులు నమోదు చేయకుండా బీఆర్‌ఎస్ కార్యకర్తలను కుట్రపూరితంగా కేసుల్లో ఇరికిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో ఏనాడు దాడులు జరగలేదని, ఈ విష సంస్కృతిని కాంగ్రెస్ పెంచిపోషిస్తుందన్నారు.

అనంతరం దేవీప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణను నాశనం చేసేందుకే రేవంత్ కంకణం కట్టుకున్నారని, ఆయన విధ్వంసకర పరిపాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందన్నారు. గత పాలనలో విమర్శలు చేసిన రాజకీయ మేధావులు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు.