calender_icon.png 28 September, 2024 | 10:50 AM

దాడులు కొనసాగిస్తాం

27-09-2024 12:41:29 AM

ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: సుధీర్ఘంగా సాగుతున్న ఇజ్రాయిల్, హెజ్బుల్లా దాడులకు సంబంధించి కాల్పుల విరమణ పాటించాలని అగ్రదేశాలు చేసిన విన్నపాన్ని ఇజ్రాయిల్ తిరస్కరించింది. తమ భూభాగంపై దాడులకు పాల్పడుతున్న హిజ్బుల్లాపై పూర్తిస్థాయి, శక్తితో దాడులు కొనసాగించాలని ఇజ్రాయిల్ ఆర్మీకి ఆ దేశ ప్రధాని నెతన్యాహూ ఆదేశించారు. ఈ నేపథ్యంలో లెబనాన్‌పై ఇజ్రాయిల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇటీవల జరిగిన సమావేశాల్లో.. 21 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని అమెరికా, బ్రిటన్, జర్మనీ, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ దేశాలు  కోరినా.. వెనక్కి తగ్గబోమని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. తాజా దాడుల్లో ఇజ్రాయిల్ దళాలు లెబనాన్‌లో సుమారు 75 హిజ్బుల్లా టార్గెట్లను పెల్చివేసినట్లు సమాచారం. ఈ దాడుల్లో 13మందికి పైగా మరిణించినట్లు లెబనీస్ ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా లెబనాన్‌పై భూతల దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది.