calender_icon.png 3 April, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలపై దాడులు ఆందోళనకరం

02-04-2025 12:21:53 AM

‘ఎక్స్’లో ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): తెలంగాణలో మహిళలపై వరుస నేరాలు, దాడులు, అఘాయిత్యాలు జరగడం ఆందోళన కలిగిస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కవిత ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో దేవాలయం వద్ద, హైదరాబాద్‌లో జర్మన్ పర్యాటకురాలిపై జరిగిన అఘాయిత్యాలు ఆవేదన కలిగించాయన్నారు.

కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. మహిళలపై వరుస నేరాలతో రాష్ర్టంలో శాంతిభద్రతలు కరువయ్యాయన్నారు. రాష్ర్టంలో మహిళలపై 22 శాతం మేర నేరాలు పెరిగినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నప్పటికీ సీఎం రేవంత్ ఏం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మొద్దు నిద్ర వీడి మహిళల భద్రతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.