* శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉండండి
* డీజీపీ, నగర సీపీకి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): సినీ ప్రముఖుల ఇళ్లపై దాడులు సరికాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నా రు. సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం ఓయూ జేఏసీ నాయకులు చేసిన దాడిని సీఎం ఖండించారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ జితేందర్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను సీఎం ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టంచేశారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీ సు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసు కోవాలని ఆదేశించారు.