హిందువులు, సిక్కులం ఐక్యంగా ఉన్నాం
ఢిల్లీలో కెనడా హైకమిషన్ ఎదుట సిక్కుల ఆందోళన
న్యూఢిల్లీ, నవంబర్ 10: కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ దేవాలయంపై ఖలిస్థాన్ మద్దతుదారుల దాడిని సిక్కు కార్యకర్తలు ఖండిం చారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని కెనడా హైకమిషన్ కార్యాలయం వెలుపల భారీ ప్రదర్శన నిర్వహించారు. హిందూ, సిక్కులు ఐక్యంగా ఉన్నారని, కెనడాలో దేవాలయాలను అపవిత్రం చేస్తే భారతీయులు సహించరు అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని నినాదాలు చేశారు. సిక్కుల నిరసన నేపథ్యంలో చాణక్యపురిలోని కెనడా హైకమిషన్ ఎదుట బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా పోలీసులను మోహరించారు. అయితే, హైకమిషన్ వైపు కవాతు చేస్తున్న హిందూ సిక్కు గ్లోబల్ ఫోరమ్‌కు చెందిన కార్యకర్తలను పోలీసులు నిలువరించారు. నవంబర్ 4న బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయంలో కాన్సులర్ క్యాంప్ జరుగుతున్న సమయంలో భక్తులపై ఖలిస్థాన్ మద్దతుదారులు దాడి చేసిన విషయం తెలిసిందే.