calender_icon.png 1 November, 2024 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్రాన్స్‌లో టెలికాం సేవలపై దాడులు

30-07-2024 12:10:00 AM

న్యూఢిల్లీ , జూలై 29:  ప్రతిష్ఠాత్మకమైన పారిస్ ఒలింపిక్స్ వేడుకలను భగ్నం చేసేందుకు కొందరు దుండగులు చేస్తున్న దాడులతో ఫ్రాన్స్ దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఒలంపిక్స్ వేడుకలకు ఒకరోజు ముందు ఆ దేశ రైల్వే నెట్‌వర్క్‌పై దుండగులు దాడిచేయడంతో ఆ రంగ రవాణా వ్యవస్థలో ఇబ్బదికర పరిస్థితులు నెలకొనడంతో దాదాపు 8 లక్షల మంది అవస్థలు పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశంలోని టెలికాం రంగ సేవలపై, మౌలిక వసతులపై దుండగులు దాడులు జరిపారు. ఫ్రాన్స్ దక్షిణ భాగంలోని ఆరు రీజియన్లలో టెలికాం కేబుల్స్, ఫైబర్ వైర్లు తదితర వాటిని కట్‌చేయడంతో పాటు పలుచోట్ల నిర్మాణాలకు నిప్పంటించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో టెలికాం సేవలపై తీవ్ర ప్రభావం పడింది. అయితే ఒలంపిక్స్ నిర్వహిస్తున్న పారిస్ నగరంపై దీని ప్రభావం పెద్దగా పడలేదు.