calender_icon.png 25 September, 2024 | 2:03 PM

రైల్వేలపై దాడులు సహించం

25-09-2024 04:11:35 AM

కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్

న్యూఢిల్లీ: ఇటీవల కొంత మంది ఆకతాయిలు రైలు పట్టాలపై ఎల్‌పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ఇనుపరాడ్లు, సిమెంట్ రేకులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ తర హా ఘటనలపై రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు.

“ఇటువంటి ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రైల్వేశాఖ అప్రమత్తంగా ఉంది. ఈ తరహా ఘటనలను నిర్మూలించేందుకు రాష్ట్రాల యంత్రాంగం తో చర్చలు జరుపుతున్నాం. ఇలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని అన్నారు. 

అది రైల్వే ఉద్యోగుల పనే.. 

గుజరాత్‌లోని సూరత్‌లో కీమ్‌ఛి మధ్య నడిచే రైలును పట్టాలు తప్పించేందుకు ఇటీవల భారీ కుట్ర జరిగింది. దీనిని దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఇది రైల్వే ఉద్యోగి పనేనని ధ్రువీకరించింది. అంతే కాకుండా సదరు రైల్వే ఉద్యోగిని కూడా గుర్తించింది. సుభాష్ పొద్దార్ అనే ఉద్యోగి తన ప్రమోషన్ కోసం ఇంత దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది.

ఇతడు ఒక్కడే కాకుండా మనీష్ కుమార్, శుభం శ్రీజైప్రకాశ్ అనే మరో ఇద్దరు రైల్వే ఉద్యోగులు కూడా ఈ ఘటనలో పాలు పంచుకున్నట్లు తేలింది. రైలు ప్రమాదాలు తప్పించిన రైల్వే ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయనే ఆశతో వీరే పథకం ప్రకారం ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది.