calender_icon.png 1 January, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోడిపందాల స్థావరాలపై దాడులు

29-12-2024 09:17:58 PM

మణుగూరు: గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరంపై జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం సాయంత్రం మెరుపు దాడులు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్గంపాడు పోలీసు స్టేషన్‌ పరిధిలోని కృష్ణ సాగర్ గ్రామ శివారులో కోడి పందాలు నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందుకున్న జిల్లా టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు వారి బృందంతో దాడులు చేశారు. ఈ దాడుల్లో ఏడుగురు పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుపడ్డ వారి నుంచి ఆరు ద్విచక్ర వాహనాలు, ఐదు కోడిపుంజులు, 17వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం బూర్గంపాడు పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బూర్గంపాడు ఎస్సై రాజేష్  తెలిపారు.