calender_icon.png 23 November, 2024 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనవసరంగా రాద్ధాంతం చేసే క్రిమినల్ కేసులు నమోదు

25-09-2024 12:18:17 PM

కామారెడ్డిలో అనవసరంగా కావాలనే రాద్ధాంతం చేశారు

 రాద్ధాంతం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు

రెచ్చగొట్టి పోలీసులపై దాడులకు పాల్పడ్డ వారిపై క్రిమినల్ కేసులు

జిల్లా ఎస్పీ సింధు శర్మ వెల్లడి

 కామారెడ్డి,(విజయక్రాంతి): అనవసరంగా గొడవలు సృష్టించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ సింధు శర్మ పేర్కొన్నారు. బుధవారం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సింధు శర్మ వివరాలను వెల్లడించారు. ఈనెల 23న ఫిర్యాదు రావడంతో జిల్లా ఎస్పీ సింధు శర్మ  నాగరాజుపై ఫోక్ సాకెట్ నమోదు చేసి విచారించిన తర్వాత మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు ఎస్పీ వెల్లడించారు.  జీవదాన్ పాఠశాలలో అనవసరంగా రాద్ధాంతం చేసి గొడవ సృష్టించిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. కొంతమంది కావాలనే అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారని, రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన వారిని సీసీటీవీ ఫుటేజీలలో గుర్తిస్తున్నామని జిల్లా ఎస్పీ చెప్పారు.

కామారెడ్డి సీఐ చంద్రశేఖర్ రెడ్డి, మరో ఎస్సై ఇద్దరు కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పాఠశాల ఫర్నిచర్ ను ధ్వంసం చేయడమే కాకుండా పాఠశాలలో అల్లర్లు సృష్టించిన విద్యార్థి సంఘ నాయకులు, రాజకీయ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులలో కొందరు ఉన్నట్లు గుర్తించామన్నారు. హైదరాబాద్ నుంచి కొందరు వచ్చి కావాలనే కమ్యూనల్ అల్లర్లు సృష్టించేందుకు వచ్చారని వారిని గుర్తించారని విలేకర్లు ప్రశ్నించగా సీసీటీవీల ఆధారంగా ఎవరెవరు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు. ఎవరెవరు దౌర్జన్యానికి పాల్పడ్డారు అనే విషయాలను స్పష్టంగా గుర్తించి వారిపై వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. బాధ్యులైన వారిని ఎవరిని వదిలే ప్రసక్తి లేదని ఆమె పేర్కొన్నారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో పోలీస్ పీకేటింగ్లను ఏర్పాటు చేసేందుకు పట్టణ ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎలాంటి పుకా రులను నమ్మవద్దని ఆమె తెలిపారు. నిన్న రకరకాలుగా పుకార్లు సృష్టించ డం వల్లనే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని ఆమె తెలిపారు. పోలీసులపై దాడులకు పాల్పడ్డ వారిపై కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎలాంటి వివరాలు తెలుసుకోవాలనుకున్న స్థానిక పోలీసులను సంప్రదించాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి కామారెడ్డి ఎల్లారెడ్డి డిఎస్పీలు నాగేశ్వరరావు శ్రీనివాసులు పాల్గొన్నారు.