నారాయణపేట, జనవరి 11ః నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏక్లాస్పూర్ గ్రామ శివారులో కొంతమంది డబ్బులు పందెం పెట్టుకుని పేకాట ఆడుతుండగా టాస్క్ఫోర్స్, నారాయణపేట పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఐదుగురు వ్యక్తుల నుండి రూ.6,700/-రూపాయలు, 05 ద్విచక్ర వాహనాలు 01 బజాజ్ ఆటో, పేక ముక్కలు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించి గేమింగ్ ఆక్ట్ ప్రకారం వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా పేకాట ఆడిన, కోడిపందాలు ఆడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్‌ఐ హెచ్చరించారు.