ఏడుగురి అరెస్ట్
మంథని, అక్టోబర్ 27 (విజయక్రాంతి): మంథని మండలంలోని సూరయ్యపల్లి శివారులో పేకాట శిబిరం కొందరు నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఏడుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై డేగ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు గ్రామ శివారులో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నారని సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహిం చారు.
పేకాటడుతున్న అల్లి రాము లు, లక్ష్మణ్, గొల్ల సురేశ్, జక్కుల లింగయ్య, సుంకరి సతీశ్, కొప్పుల సాగర్, భూమయ్యను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు పరారయ్యారు. నిందితుల నుంచి పోలీసు లు రూ.18 వేలతో పాటు మూడు మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.