15 మంది అరెస్ట్, రూ.6లక్షలు స్వాధీనం
గద్వాల (వనపర్తి), అక్టోబర్ 7 (విజయక్రాంతి): వనపర్తి జిల్లా రంగాపురం శివారులోని ఓ గోదాంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచ్ సీఐ నాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇటిక్యాల ఎస్సై వెంకటేష్, వనపర్తి పోలీసులు సోమవారం దాడులు చేశారు. 15 మందిని అరెస్ట్ చేసి, రూ.6.35లక్షల నగదు, 4 కార్లు, 3 బైక్‌లు, 15 మ్బుల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.