calender_icon.png 26 March, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాటు సారా స్థావరాలపై దాడులు

25-03-2025 06:18:20 PM

ఇద్దరిపై కేసులు..

కాటారం (విజయక్రాంతి): కాటారం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో నాటు సారా నిర్మూలనకై ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు ప్రోహిబిషన్ ఎక్సజ్ ఎస్ఐ కిష్టయ్య తెలిపారు. భూపాలపల్లి జిల్లా మలహార్ రావు మండలంలోని అడ్వాలపల్లి, దుబ్బపేట, గాదాంపల్లి గ్రామాలలో నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించి రెండు కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, 12  లీటర్ల నాటు సారా, 40 కేజీల చక్కెరను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 600 లీటర్ల చక్కర పానకంను ధ్వంసం చేశారు. అనంతరం నాటు సారా తాగడం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కలిగించారు. గుడుంబా తయారు చేసినా, కలిగి వున్నా, రవాణా చేసినా, అమ్మినా.. చట్ట ప్రకారం కఠిన చర్యలు వుంటాయని తెలిపారు. ఈ దాడులలో హెడ్ కాని స్టేబుల్ రాంచందర్, కాని స్టేబుల్లు వెంకట రాజు, రామకృష్ణ పాల్గొన్నారు.