calender_icon.png 30 October, 2024 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వాసుపత్రుల సమీపంలోని మెడికల్ షాపులపై దాడులు

30-10-2024 02:20:43 AM

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల దగ్గర ఉండే ప్రైవేట్ మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, పేట్ల బురుజు, వరంగల్ ఎంజీఎం, కరీంనగర్ జీజీహెచ్‌లోని 15 షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.

నిబంధనల మేరకు లేని దుకాణాలకు షోకా జ్ నోటీసులు ఇచ్చారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం, ఫార్మసిస్టులు లేకపో వడం, డ్రగ్ స్టాక్ రిజిస్టర్ మెయింటేన్ చేయకపోవడం, అమ్మకం, కొనుగోలు బిల్లింగ్ ప్రాసెస్ జరగడం లేదని, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని డ్రగ్ కంట్రోల్ డీజీ వీబీ కమలాసర్ రెడ్డి తెలిపారు.

స్టోరేజ్ రూమ్‌లు సక్రమంగా లేకపోవడం, ప్రభుత్వాసుపత్రులలోని మందులు ఈ షాపుల్లో కనిపించడం, ఎక్స్‌ఫైర్ మెడిసిన్స్ లభించి నట్లు వివరించారు. వాళ్ల వివరణ తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఉస్మా నియా ఆసుపత్రి పరిధిలోని వైష్ణవి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, జీవన్ ఉషా స్రవంతి జనరిక్ మెడికల్ స్టోర్స్, ఖులీ కుతుబ్ షా మెడికల్ అండ్ జనరల్ స్టోరస్, జీవన్ ధారా ఫార్మసీ, అమ్రిత్ ఫార్మసీలపై దాడులు చేశారు. నిలోఫర్ ఆసుపత్రిలో సాయి ఫార్మసీ, కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్టు, అమ్రిత్ ఫార్మసీలపై తనిఖీలు నిర్వహించారు.

పేట్ల బురు జు ఆసుపత్రి ప్రాంగణంలో జన జీవని జ్యోతి స్టోర్‌పై తనిఖీలు చేశా రు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో తిరుమల మెడికల్ అండ్ జనరల్ స్టోర్, శ్రీ సాయి మెడికల్, మోహిత్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ పై రెయిడ్స్ జరిగాయి. కరీంనగర్ గవర్నమెంట్ ఆసుపత్రిలో పరిధిలోనిని జీవన్ ధారా, ప్రజా ఆరోగ్య ఫార్మసీలపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ తనిఖీలు నిర్వహించి నోటీసులు ఇచ్చినట్లు కమలాసన్ రెడ్డి ప్రకటించారు.