calender_icon.png 15 November, 2024 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవాదులపై దాడులను అరికట్టాలి

13-11-2024 05:59:34 PM

కోదాడ (విజయక్రాంతి): దేశంలో, రాష్ట్రంలో రోజురోజుకు న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ ఆర్ కే మూర్తి డిమాండ్ చేశారు. హైదారాబాద్ లో అడ్వకేట్ పై కత్తులతో దాడి చేసిన సంఘటనకు నిరసనగా బుధవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోదాడ కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.

ఈ కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదులపై దాడులు పెరుగుతున్న ప్రభుత్వాలు మాత్రం వారి రక్షణకు చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసారు. న్యాయవాదుల రక్షణకు సమగ్ర చట్టం రూపొందించి, దానిని అమలు చేయాలని, దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గట్ల నరసింహారావు, ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల రామిరెడ్డి, కార్యవర్గం కోడూరు వెంకటేశ్వర రావు, హేమలత, దొడ్డ శ్రీధర్, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.