26-03-2025 01:06:59 AM
వికారాబాద్, మార్చ్-25: న్యాయవాదులపై జరుగుతున్న దాడులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని వికారాబాద్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కుమార్ అన్నారు.రెండు రోజులు క్రితం ఓ న్యాయవాది ని అతి దారుణంగా హత్య చేసిన ఘటన ను నిరసిస్తూ మంగళవారం వికారాబాద్ జిల్లా కోర్టు న్యాయవాద సంఘo అధ్వర్యంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొని దారుణాన్ని ఖండించారు.
న్యాయవాదులు విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. న్యాయవాదుల పై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎలాంటి చర్య లు తీసుకోవడం లేదని , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల పరిరక్షణ కు పటిష్ట మైన చర్యలు తీసుకోవాలని అందులో భా గంగా న్యాయవాదుల కు రక్షణ కల్పించేలా ప్రత్యేక చట్టాలు తేవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం వికారాబాద్ బార్ న్యాయవాదులు పాల్గొన్నారు.