calender_icon.png 3 April, 2025 | 1:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుపై దాడులు చేస్తే సహించేది లేదు

01-04-2025 12:30:11 AM

మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

గాయపడ్డ జర్నలిస్టు జంగం శ్రీనివాస్‌కు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

అందోల్, మార్చి31: అన్యాయాలను వెలికి తీసే జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే చీకటి దందా చేస్తున్న బియ్యం మాఫియా నిజాలు వెలుగులోకి వస్తే  తమ ఉనికికి ప్రమాదమని తెలిసి ఏకంగా విలేకరులపై భౌతిక దానికి పాల్పడడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే గొంతుకలను తొక్కేయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సంగుపేట శివారులో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న మాఫియా సాక్షి టీవీ విలేఖరి జంగం శ్రీనివాస్ v6 విలేఖరి అనిల్ చారి లపై కర్రలతోదాడి చేసి చేయి విరగొట్టిన సంగతి విధితమే.

ఈ విషయమై సోమవారం నాడు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆందోల్‌లోని శ్రీనివాస్ స్వగృహంలో  గాయపడ్డ శ్రీనివాసును పరామర్శించారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. భౌతిక దాడులకు పాల్పడ్డ మాఫియా ముఠాలోని వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోలేకపోయారని, పోలీసు వ్యవస్థ కూడా జర్నలిస్టు దాడులపై స్పందించకుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. నిందితుడు ఎంతటి వారినైనా చట్టపరంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డిసిసిబి మాజీ ఉపాధ్యక్షులు జయపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ రామా గౌడ్, జోగిపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డిబి నాగభూషణం, ఆందోల్ పుల్కల్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు చాపల వెంకటేశం, ముద్దాయి పేట విజయ్, బి ఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాసును పరామర్శించారు.