ఇరాన్ నేత ఖోమేనీ
న్యూ ఢిల్లీ, ఆగస్టు 3:హెజ్‌బొల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్ మృతి, హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హానియా హత్య ఘటనతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో హెజ్‌బొల్లాకు ఇరాన్ బహిరంగ మద్దతు తెలపడం ఇప్పడు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. హెజ్‌బొల్లా.. ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున దాడులకు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిచేసిన దగ్గరి నుంచి ఇజ్రాయెల్ గాజాలో భీకరదాడులు చేస్తోంది. అప్పటినుంచి సరిహద్దులో హజ్‌బొల్లాకు టెల్ అవీవ్ సేనలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. హమాస్ నేత ఇస్మాయిల్ హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖోమేనీ ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. ఇజ్రాయెల్ లోపల మరిన్ని దాడులు జరగొచ్చని, దాడులు కేవలం మిటిటరీ లక్ష్యాలకే పరిమితం కాకుండా పౌరులపై కూడా జరగొచ్చనే హెచ్చరికలు సైతం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడారు. దాడులు జరిగితే అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.