calender_icon.png 5 December, 2024 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు సరికాదు

05-12-2024 12:48:49 AM

తెలంగాణ శ్రీశైవ క్షేత్ర పీఠం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 4 (విజయక్రాంతి): శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామిజీ సూచన మేరకు తెలంగాణ శ్రీ శైవక్షేత్ర పీఠం ఆధ్వర్యంలో బంగ్లాదేశ్‌లో హిందువులు, దేవాలయాలు, స్వామిజీలపై దాడులను ఖండిస్తూ బుధవారం శైవ క్షేత్రం, టెలిఫోన్ కాలనీ నుంచి కొత్తపేట శ్రీభవానీ మాత దేవస్థానం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. బంగ్లాదేశ్ ప్రభుత్వంపై చర్యలు చేపట్టి హిందూ దేవాలయాలపై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించి, హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. నిరసన ర్యాలీలో విశ్వధర్మ పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆత్మానంద భారతి స్వామిజీ, శ్రీశివ కామేశ్వరి మాతాజీ, రామకృష్ణాపురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్‌రెడ్డి, ఎల్‌వీ కుమార్, అయిత హైమ, వీ కోటేశ్వరరావు, జగిని శ్రీనివాస్, ప్రవీణ్ దూబే, భవన రుషి, సామమూర్తి, వాసు, రేణుక పాల్గొన్నారు.