calender_icon.png 10 January, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందువులపై దాడులు

21-12-2024 02:26:24 AM

  • బంగ్లాలో 2 వేలకు పైగా కేసులు నమోదు.. 

పాక్‌లో 112 ఘటనలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరుగుతున్నా యి. ఇక పొరుగుదేశం పాకిస్తాన్‌లో ఎప్పటి నుంచో హిందువులపై దా డులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు దేశాల్లో హిందువు లపై ఈ ఏడాదిలో జరిగిన దాడుల గురించి విదేశాంగ శాఖ రాజ్యసభకు డేటాను సమర్పించింది. షేక్ హసీనా బంగ్లా ప్రధానిగా పదవీచ్యుతురాలు అయిన తర్వాత హిందువులపై దా డులు పెరిగాయి.

2,200 ఘటనల్లో హిందువులపై దాడులు జరిగినట్లు కేసులు నమోదయ్యాయని, పాకిస్తాన్‌లో 112 కేసులు నమోదైనట్లు విదే శాంగశాఖ స్పష్టం చేసింది. ఈ ఘటనలపై ఇప్పటికే బంగ్లా ప్రభుత్వానికి తమ ఆందోళనను తెలియజేశామని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇదే బం గ్లాలో 2022లో 47, 2023లో 302 ఘటనల్లో హిందువులపై దాడులు జరిగినట్లు రికార్డులు చెబుతున్నా యి. ఈ రెండు దేశాలు తప్పా మిగ తా ఏ దేశాల్లోనూ హిందువులపై హింసాత్మక దాడులు నమోదు కాలేదని విదేశాంగ శాఖ వెల్లడించింది.