గవర్నర్‌కు బీజేపీ వినతి
హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహారిస్తోందని, పోలీసులే మఫ్టీలో రెచ్చగొట్టి దాడులకు పాల్పడ్డారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు.
హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై సోమవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీజేపీఎల్పీ లీడర్ ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి, ఎంపీలు ఈటల, రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే హరీశ్‌బాబు కలిసి వినతిప త్రం అందజేశారు. ఆ తర్వాత డీజీపీ జితేందర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నిందితుడిని పిచ్చోడు అని ముద్ర వేసి వదిలేసే ప్రయత్నం చేశారని, శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే ర్యాలీలో కొందరు పోలీసులు మఫ్టీలో చొరబడి దాడులు, లాఠీచార్జి జరిగేలా చేశారని ఆరోపించారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి సూచించాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. ధార్మిక సంఘాల నేతలపై పెడు తున్న కేసులను ఎత్తివేసేలా చూడాలన్నారు. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. నిందితుల మీద ప్రభుత్వం కేసు పెట్టకుండా ఏమి చేస్తోందని నిలదీశారు.
ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. హిందూ దేవాలయా లపై జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ట్రైనింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. బంగ్లాదేశ్ స్లీపర్స్ సెల్స్‌కు రాష్ట్రంలో ట్రైనింగ్ ఇస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు.