calender_icon.png 17 October, 2024 | 5:53 AM

ఎరుకల కులస్థులపై దాడులు హేయం

17-10-2024 02:15:00 AM

నిందితులపై చర్యలు తీసుకోవాలి

తెలంగాణ ఎరుకల గిరిజన హక్కుల ఐక్య పోరాట సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సాయికుమార్

కామారెడ్డి, అక్టోబర్ 16 (విజయక్రాంతి): ఎరుకల కులస్థులపై దాడులు హేయమని తెలంగాణ ఎరుకల గిరిజన హక్కుల ఐక్య పోరాట సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొ నేరు సాయికుమార్ అన్నారు. బుధవారం కామారెడ్డి ఎస్పీ కార్యాలయం ఆవరణ లో ఆయన మాట్లాడారు.

గాంధారి మండల కేంద్రానికి చెందిన ఎరుకల పెద్దసాయిలు 25 సంవత్సరాల క్రితం గాంధారికే చెందిన దేశ్‌పాండే హన్మంత్‌రావు వద్ద 360 గజాల స్థలాన్ని కొని గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. గత నెల 26న దీలిప్‌రావు, కృష్ణాగౌడ్, భాస్కర్, తాటి మధుసూదన్, బెజుగాం సంతోష్‌తో పాటు మరికొంతమంది కామారెడ్డి, భిక్కనూరు నుంచి గుండాలను తీసుకొచ్చి సాయిలు ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు.

ఎస్పీ సింధూశర్మ నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేస్తామని తెలిపారని సాయికుమార్ వెల్లడించారు. ఆయనవెంట కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కుర్ర రాములు, ఎరుకల భూమవ్వ, ఎరుకల పెద్ద సాయిలు, ఎరుకల రేణుక, ఎరుకల సాయవ్వ, ఎరుకల రమేష్ ఉన్నారు.